Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
- వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ప్రజలు
- ఈ పర్వదినం రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయన్న సీఎం
- ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని సందేశాన్ని ఇచ్చిన చంద్రబాబు
వైకుంఠ ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని తెలుగు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షల సందేశాన్ని పంచుకున్నారు.