వీడియోలతో బ్లాక్‌మెయిల్.. యువకుడిని కొట్టి చంపిన అక్కాచెల్లెళ్లు!

Telangana
Advertisement
  • పెళ్లి సంబంధం చెడగొట్టాడనే కోపంతో కక్ష పెంచుకున్న అక్కాచెల్లెళ్లు
  • పథకం ప్రకారం పిలిపించి, కళ్లలో కారం కొట్టి కర్రలతో దాడి
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెడికల్ రిప్రజెంటేటివ్ మృతి
Advertisement
ప్రేమ, వివాహేతర సంబంధం, ఆపై అసభ్యకర వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్.. చివరకు ఓ యువకుడి ప్రాణం తీశాయి. జగిత్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ జీవితాలను నాశనం చేస్తున్నాడనే కోపంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి ఒక యువకుడిని దారుణంగా హతమార్చారు.

పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్ (32) హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసేవాడు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఒక యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె అక్కతో కూడా మహేందర్ సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఆ యువతికి పెళ్లి సంబంధం రావడంతో మహేందర్ అసూయతో రగిలిపోయాడు. తన దగ్గర ఉన్న ఆమె అసభ్యకర వీడియోలను కాబోయే పెళ్లికొడుకు తరఫు వారికి చూపి ఆ సంబంధాన్ని చెడగొట్టాడు.

నిరంతరం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న మహేందర్‌ను వదిలించుకోవాలని అక్కాచెల్లెళ్లు నిర్ణయించుకున్నారు. పక్కా ప్లాన్‌తో శుక్రవారం రాత్రి అతడికి ఫోన్ చేసి పిలిపించారు. రాత్రి 10 గంటల సమయంలో వారి మధ్య మాటమాట పెరగడంతో ముందే సిద్ధం చేసుకున్న కారంపొడిని మహేందర్ కళ్లలో చల్లారు. అతడు తేరుకునేలోపే కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిందితుల బంధువులు కూడా పాలుపంచుకున్నారు.

తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మహేందర్‌ను గమనించిన స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతడు శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Burra MahenderJagitialExtra marital affairBlackmailMurderTelangana crimeVideo blackmailAffairCrime newsSisters

More Telugu News

బాల్ ట్యాంపరింగ్ కుట్ర.. ఆ ముగ్గురికే కాదు, జట్టు మొత్తానికీ తెలుసు: ఉస్మాన్ ఖవాజా

07 Nov, 10:52

ఓట్ల లెక్కింపునకు ముందే విషాదం.. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య మృతి

07 Nov, 10:49

17 ఏళ్ల నిరీక్షణకు తెర.. కూకట్‌పల్లి ఫ్లాట్లపై సుప్రీం కీలక ఆదేశాలు

07 Nov, 10:48

ఇరాన్‌తో యుద్ధమే లేదు.. ఇజ్రాయెల్‌ను నేనే కాపాడాను: ట్రంప్

07 Nov, 10:45

ప్రముఖ వైద్యుడు దేవిశెట్టికి ఫ్రాన్స్ ప్రతిష్ఠాత్మక పురస్కారం

07 Nov, 10:43

ఆరోగ్యకరమైన దీపావళికి సిద్ధమవ్వండి.. ఈ ఒక్క రోజు ఇలా చేస్తే చాలు!

07 Nov, 10:15

హైదరాబాద్‌లో స్నేహం పేరుతో మోసం... కిలోల కొద్దీ బంగారం, వెండి చోరీ

07 Nov, 10:12

అనంతపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్

07 Nov, 10:11

ఫిట్‌నెస్ సాధించిన పంత్.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు లైన్ క్లియర్

07 Nov, 10:09

అతడిలో ఇంకా సత్తా ఉంది.. షమీ విషయంలో సెలక్టర్లు తప్పు చేశారు: రవిశాస్త్రి

07 Nov, 10:07

659 జడ్పీటీసీలు.. 9,821 ఎంపీటీలకు కౌంటింగ్.. పార్టీల వారీగా పూర్తి వివరాలు

07 Nov, 10:03

అభిషేక్ బెనర్జీ ఇంటిపై దాడి.. తనను చంపేందుకేనన్న టీఎంసీ ఎంపీ

07 Nov, 09:46

ధోనీని ‘మాహీ చాచూ’ అని పిలుస్తా.. నటి అనుష్క సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు

07 Nov, 09:44

కీరవాణి ఇంట శుభకార్యం.. ఘనంగా కుమారుడి నిశ్చితార్థం!

07 Nov, 09:42

ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్లు.. అమెరికా సంచలన ఆఫర్!

07 Nov, 09:33
..More Telugu News