పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. 17 నుంచి ఉత్సవాలు
- రేపు ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభం
- 22న గరుడ వాహనసేవ, 24న రథోత్సవం
- 25న పంచమీ తీర్థంతో ఉత్సవాల ముగింపు
- ప్రతిరోజూ ఉదయం, రాత్రి అమ్మవారి వాహన సేవలు
నవంబర్ 17వ తేదీ ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయి. ఉత్సవాలు జరగనున్న తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అమ్మవారు వివిధ వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22న స్వర్ణరథం, గరుడ వాహన సేవ, 24న రథోత్సవం కన్నులపండువగా జరగనున్నాయి. చివరి రోజైన నవంబర్ 25న ఉదయం పంచమీ తీర్థం (చక్రస్నానం), రాత్రి ధ్వజావరోహణంతో ఈ వార్షిక ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.