కెనడాలో హత్య కేసు... భారత సంతతి వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష
- 2022 అక్టోబర్ 17న హత్యకు గురైన విశాల్ వాలియా
- విశాల్‌ను కాల్చి చంపి, కారును తగులబెట్టిన నిందితులు
- ఇద్దరు యువకులకు 17 ఏళ్ల చొప్పున ఇదివరకు శిక్ష ఖరారు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేయగా, భారత సంతతికి చెందిన బాలరాజ్ సింగ్ బాస్రాతో పాటు ఇక్బాల్ కాంగ్, డియాండ్రే బాప్టిస్ట్‌లు ఈ హత్య చేసినట్లు తేలింది. సాక్ష్యాధారాలు మాయం చేయడానికి వాహనాన్ని తగులబెట్టినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.
దీంతో ఈ ముగ్గురిని బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి పెరోల్ లేని శిక్షను విధించింది. ఈ కేసులో ఇద్దరు యువకులకు 17 ఏళ్ల చొప్పున శిక్షను న్యాయస్థానం ఇదివరకే ఖరారు చేసింది. తాజాగా, భారత సంతతి వ్యక్తికి శిక్షను ఖరారు చేసింది.