Narendra Modi: మీ పరాక్రమం వల్ల పాక్ కు నిద్రలేని రాత్రుళ్లు.. నేవీ సిబ్బందితో మోదీ.. వీడియో ఇదిగో!
- ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ మెడలు వంచారంటూ ప్రశంసలు
- ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని
- ఓవైపు సముద్రం.. మరోవైపు భరత మాత వీర పుత్రుల శౌర్యం కనిపిస్తోందని వ్యాఖ్య
ఆపరేషన్ సిందూర్ లో మీ పరాక్రమం చూసి పాకిస్థాన్ కు నిద్రలేని రాత్రుళ్లు గడిపిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ భారత నావికాదళ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని తన ఆనవాయతీ కొనసాగిస్తూ ఈ సంవత్సరం దీపావళి వేడుకలను ఐఎన్ఎస్ విక్రాంత్ పై జరుపుకున్నారు. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పై నౌకాదళ సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. గోవా, కర్వార్ తీరంలోని స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన ప్రధాని.. అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. నౌకాదళ యూనిఫాంతో మోదీ ప్రసంగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘మీతో కలిసి దీపావళి పర్వదినం జరుపుకోవడం నాకు దక్కిన అదృష్టం. నాకు ఓవైపు మహా సముద్రం, మరోవైపు భరతమాత వీర పుత్రుల శౌర్యం కనిపిస్తోంది. సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల్లా మెరుస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ లో మీ పరాక్రమం చూపి పాకిస్థాన్ మెడలు వంచారు’’ అని మోదీ ప్రశంసలు కురిపించారు.
కాగా, దేశ ప్రధాన మంత్రిగా 2014లో ప్రమాణం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. సైనిక దుస్తులు ధరించి, దళాలతో కలిసిపోయి వారితో మాట్లాడుతూ, స్వీట్లు తినిపిస్తూ జవాన్లలో స్ఫూర్తి నింపుతున్నారు.