AP State Disaster Management: ఈశాన్య రుతుపవనాల జోరు... ఏపీకి వర్ష సూచన
నేడు ఏపీలోని పలు జిల్లాల్ల వర్షాలు పడే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడి
అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
శుక్రవారం (అక్టోబర్ 17) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని సంస్థ తెలిపింది. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ వంటి వాటి వద్ద నిలబడకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.