Sumeet Sabharwal: ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన.. సుప్రీంకోర్టులో పైలట్ తండ్రి పిటిషన్

Sumeet Sabharwal Ahmedabad Air India Crash Pilots Father Petitions Supreme Court
షార్ట్స్‌లో చూడండి
ఈ ఏడాది జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై పైలట్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్పరాజ్ సభర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత పైలట్ల సమాఖ్య కూడా ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో న్యాయస్థానం పర్యవేక్షణ కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కుప్పకూలడంతో 260 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో ప్రధాన పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్ కూడా మరణించారు. అయితే, ఈ విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్లు ఆరోపించారు. దర్యాప్తు బృందం ప్రధానంగా పైలట్ల పైనే దృష్టి సారించిందని అన్నారు. ఈ విషాదానికి దారితీసిన సాంకేతిక, విధానపరమైన అంశాలను పరిశీలించడంలో విఫలమైందని అన్నారు.

దర్యాప్తు సంస్థ నివేదికలోని ఎంపిక చేసిన భాగాలను బహిర్గతం చేయడం ద్వారా వాస్తవాలను తప్పుదోవ పట్టించడం, పైలట్లను లక్ష్యంగా చేసుకోవడం వంటివి అసలైన కారణాన్ని గుర్తించడాన్ని కఠినతరం చేస్తాయని పేర్కొంది. ఈ దర్యాప్తు బృందంలో డీజీసీఏ, విమానయాన అధికారులే ఉన్నారని పేర్కొన్నారు. ఏ వ్యక్తి కూడా తన సొంత కేసులో న్యాయమూర్తిగా ఉండకూడదనే సహజ న్యాయసూత్రాన్ని ఇది ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు.

ప్రధాన పైలట్ సుమీత్ సభర్వాల్‌కు దశాబ్దాల అనుభవం ఉందని, ముప్పై ఏళ్ల కెరీర్‌లో ఒక్క మచ్చ కూడా లేదని కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీతో న్యాయ పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Sumeet Sabharwal
Air India flight crash
Ahmedabad
Pilot error
DGCA investigation
Supreme Court petition

More Telugu News