ఆ రూ.3 లక్షలు తిరిగి ఇచ్చేలా ఆదేశించండి: మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
- టెండర్ దక్కని వారికి డబ్బు తిరిగి వచ్చేలా ఆదేశించాలని కోరిన పిటిషనర్
- లాటరీలో దుకాణం దక్కకపోతే ఆ మొత్తం ఆబ్కారీ శాఖకే వెళుతుందన్న పిటిషనర్
- మద్యం పాలసీపై జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరిన పిటిషనర్
మద్యం టెండర్ కోసం ఒక్కో దరఖాస్తుకు రుసుముగా రూ. 3 లక్షలు నిర్ణయించారని, లాటరీలో మద్యం దుకాణం దక్కని పక్షంలో ఆ మొత్తం ఎక్సైజ్ శాఖకే చెందుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా సంబంధిత శాఖను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అంతేకాకుండా, మద్యం విధానంపై జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.