రక్షణ రంగంలో భారత్ చారిత్రక విజయం... దేశీయ టర్బోజెట్ ఇంజిన్ సిద్ధం!
- దేశీయంగా తొలి ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ అభివృద్ధి
- డీఆర్‌డీఓ డిజైన్, హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ
- క్షిపణులు, డ్రోన్ వ్యవస్థలలో ఈ ఇంజిన్ అత్యంత కీలకం
- ఆత్మనిర్భర్ భారత్ దిశగా కీలక ముందడుగు
రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధన దిశగా దేశం ఒక చారిత్రక మైలురాయిని అధిగమించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ‘ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్’ విజయవంతంగా ఆవిష్కృతమైంది. 350 కేజీల థ్రస్ట్ క్లాస్‌కు చెందిన ఈ ఇంజిన్‌ను క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) తయారీలో భారత స్వావలంబనకు కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.
బెంగళూరులోని డీఆర్‌డీఓ అనుబంధ సంస్థ ‘గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్’ (జీటీఆర్‌ఈ) ఈ ఇంజిన్‌ను డిజైన్ చేయగా, హైదరాబాద్‌కు చెందిన ‘ఆజాద్ ఇంజినీరింగ్’ సంస్థ ఇండస్ట్రీ పార్ట్‌నర్‌గా దీనిని నిర్మించి, అసెంబుల్ చేసింది. కేవలం 24 నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన ఆజాద్ ఇంజినీరింగ్, జూలై 22న ఈ ఇంజిన్‌ను డీఆర్‌డీఓ ఉన్నతాధికారులకు అందజేసింది. ఆజాద్ ఇంజినీరింగ్ సీఈఓ రాకేష్ చోప్దార్ చేతుల మీదుగా డీఆర్‌డీఓ ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె. రాజలక్ష్మి మేనన్, జీటీఆర్‌ఈ డైరెక్టర్ డాక్టర్ ఎస్.వి. రమణమూర్తి దీనిని స్వీకరించారు.
అత్యంత సంక్లిష్టమైన జెట్ ఇంజిన్ సాంకేతికత ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ ఘనత సాధించడం ఏరోస్పేస్ ప్రొపల్షన్ రంగంలో స్వయం సమృద్ధికి నాందిగా నిలవనుంది. ఈ రకమైన ఇంజిన్లను ప్రధానంగా నౌకా వ్యతిరేక క్షిపణులు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు మరియు యూఏవీలలో విస్తృతంగా వినియోగించనున్నారు.
ఈ చారిత్రక విజయంపై డీఆర్‌డీఓ చైర్మన్ మరియు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ.. జీటీఆర్‌ఈ, ఆజాద్ ఇంజినీరింగ్ బృందాలను అభినందించారు. డీఆర్‌డీఓ మరియు ప్రైవేట్ పరిశ్రమల మధ్య సమన్వయంతో కూడిన బలమైన భాగస్వామ్యానికి ఇది ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు.