సొంత భూభాగంపై పాక్ సైన్యం వైమానిక దాడి.. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 30 మంది పౌరులు హతం
- కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో భాగంగా ఓ గ్రామంపై సైన్యం దాడి
- మృతుల్లో మహిళలు, చిన్నారులు
- ఇళ్ల శిథిలాల కింద మరింతమంది చిక్కుకుని ఉండవచ్చని సందేహాలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ ప్రావిన్స్ లో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 605 ఉగ్రవాద దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 138 మంది సామాన్యులు, 79 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఒక్క ఆగస్టు నెలలోనే 129 ఉగ్ర దాడులు జరిగాయని, ఈ ఘటనల్లో ఆరుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు.