బీచ్‌లో పంజాబీ పాటలు.. భారతీయులపై కెనడియన్ ఫైర్.. మాకొక రూల్, మీకొక రూలా?
- కెనడా బీచ్‌లో పంజాబీ పాటలపై కెనడియన్ వ్యక్తి ఆగ్రహం
- పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ పెట్టారని వీడియో తీసి పోస్ట్
- తాను గిటార్ వాయిస్తే ఫైన్ వేశారని అధికారులపై విమర్శలు
- సోషల్ మీడియాలో వీడియోపై తీవ్ర చర్చ, దుమారం
- నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు, భిన్నాభిప్రాయాలు
అసలేం జరిగిందంటే..?
ఒంటరిగా సంగీత ప్రదర్శనలు ఇచ్చే ఓ కెనడియన్ కళాకారుడు బ్యారీ నగరంలోని బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ భారతీయ కుటుంబం స్పీకర్‌లో పెద్ద సౌండ్‌తో పంజాబీ పాటలు పెట్టి, నీళ్లలో ఆడుకుంటూ కనిపించింది. దీన్ని వీడియో తీసిన ఆ వ్యక్తి, స్థానిక అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. "బీచ్‌కు వచ్చి ఇష్టమొచ్చిన పాటలు, నచ్చినంత సౌండ్‌తో పెట్టుకోవడానికి ఇదో ఉదాహరణ. పాటలు పెట్టినవాళ్లు ఇక్కడ లేరు. కానీ, 150 అడుగుల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని వినాల్సిందే. బ్యారీ నగరం చాలా గొప్పగా పనిచేస్తోంది" అంటూ అని విమర్శించాడు.
గతంలో తాను ఇదే బీచ్‌లో ఓ ఫుడ్ బ్యాంక్ కోసం నిధులు సేకరించేందుకు గిటార్ వాయిస్తే అధికారులు తనకు జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. "నేను మంచి పని కోసం గిటార్ వాయిస్తే మాత్రం ఒప్పుకోరు. కానీ ఇక్కడకి ఎవరైనా వచ్చి, ఇతరులందరినీ ఇబ్బంది పెట్టేలా పాటలు పెట్టుకోవచ్చు" అని అధికారుల ద్వంద్వ వైఖరిని నిలదీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది అతడికి మద్దతు తెలుపగా, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. "పెద్ద మనిషివై ఉండి ఇంటర్నెట్‌లో ఏడవడం ఎందుకు? నేరుగా వాళ్లతో మాట్లాడి సౌండ్ తగ్గించమని అడగవచ్చు కదా?" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. "వలసదారులను కించపరచడానికే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు. పోయినవారం నేను వెళ్లినప్పుడు ఇంగ్లిష్ పాటలు పెద్ద సౌండ్‌తో పెట్టారు, నేనెవరినీ ఏమీ అనలేదు. అనవసర రాద్ధాంతం మానుకోండి" అని మరో యూజర్ మండిపడ్డారు. "బతుకు, బతకనివ్వు. ప్రతీదాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు" అంటూ ఇంకొందరు హితవు పలికారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
More Telugu News
విజయవాడ - హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. చిన్నారితో సహా నలుగురు మృతి
![]()
‘జరగని పెళ్లికి టికెట్లు’.. కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో సియా గోయల్ చాట్ కలకలం!
![]()
ఆన్లైన్ ఆర్డర్లో దుర్గంధం: ఫ్యాషన్ బ్రాండ్ జారాపై నటి త్రిష ఫైర్
![]()
‘ఒక్క దెబ్బతో ఇరాన్ లీడర్షిప్ను ఖతం చేయొచ్చు’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
![]()
అమెరికా 250వ వేడుకలకు వాతావరణం దెబ్బ.. ట్రంప్ సభ రద్దు
![]()
అవకాశాల కోసం రాజీ పడొద్దు: యువ నటులకు కాజల్ హితవు
![]()
ఏపీలో పలువురు డీఎస్పీలకు పదోన్నతులు
![]()
జైలులో ఉన్న టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లా చుట్టూ బిగుస్తున్న ‘లైంగిక’ ఉచ్చు!
![]()
చంద్రబాబు సర్కార్‌పై బొత్స ఫైర్.. హామీల అమలులో విఫలమంటూ విమర్శలు
![]()
బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. వేటకు వెళ్లిన ఏడుగురు ఉత్తరాంధ్ర మత్స్యకారుల గల్లంతు!
![]()
టాటా ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్లు.. జూలైలో రూ.3.35 లక్షల వరకు ఆఫర్లు!
![]()
ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవంపై ప్రత్యేక సందేశం
![]()
ప్రకాశ్ రాజ్‌పై నిప్పులు చెరిగిన జనసేన నేత కిరణ్ రాయల్..
![]()
బెతెల్ బాదుడు... రెండో టీ20లో టీమిండియా ఓటమి
![]()
రేపు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. దేశంలో ఫేమస్ బిర్యానీలు ఇవే!
![]()