Seethakka: సీతక్కకు బెదిరింపు లేఖ.. మావోయిస్టుల కొత్త ట్విస్ట్!

Seethakka Receives Threat Letter Maoists Deny Involvement
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ కొన్ని రోజుల క్రితం విడుదలైన మావోయిస్టుల లేఖ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. అయితే, ఈ వ్యవహారంలో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ లేఖను తాము విడుదల చేయలేదని మావోయిస్టు పార్టీయే స్వయంగా ప్రకటించింది.

వారం క్రితం మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. ఇది మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమైంది. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఈ లేఖపై మొదటి నుంచి కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో మావోయిస్టు పార్టీయే దీనిపై స్పష్టత ఇచ్చింది.

సీతక్కను ఉద్దేశించి తాము ఎలాంటి లేఖ రాయలేదని తేల్చిచెబుతూ మావోయిస్టు పార్టీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీయే స్వయంగా ఖండించడంతో ఆ మొదటి లేఖను ఎవరు సృష్టించారు? వారి ఉద్దేశం ఏంటి? అనే దానిపై చర్చ జరుగుతోంది.
Go Back to Shorts
Seethakka
Telangana Minister
Maoist Letter
Fake Letter
Naxalites
Threat Letter
Telangana News
Political Controversy

More Telugu News