ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు
- ఏపీలో శుక్రవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
- తీరం దాటిన వాయుగుండం
- దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
కాగా, ఆగ్నేయ రాజస్థాన్ నుంచి ఉత్తర మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయవ్య బంగాళాఖాతంలోని వాయుగుండం కేంద్రం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది.
అటు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది నేటి మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవి, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరం దాటింది.
మరోవైపు, నైరుతి రుతుపవనాలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. బంగాళాఖాతంలోని వాయుగుండం పరిస్థితులు కూడా రుతుపవనాల కదలికలకు తోడ్పడుతున్నాయి.