Tinto de Verano: వేసవి వేడిని ఢీకొట్టే 'స్పానిష్ కాక్ టెయిల్'!
- స్పెయిన్ ప్రసిద్ధ వేసవి పానీయం టింటో డి వెరానో
- రెడ్ వైన్, లెమన్ సోడాతో సులభంగా తయారీ
- వేడి వాతావరణానికి అనువైన చల్లని పానీయం
- నిమిషాల్లోనే సిద్ధం చేసుకునే వెసులుబాటు
- సాంగ్రియాకు, దీనికి మధ్య చాలా తేడాలు
రోజు మొత్తం అలసిపోయి ఇంటికి వచ్చాక... ఓ గ్లాసు రెడ్ వైన్‌తో సేదతీరితే ఆ హాయే వేరు. అయితే, మండే వేసవి కాలంలో చిక్కటి రెడ్ వైన్ తాగాలంటే కాస్త ఇబ్బందే. వేడికి అలాంటివి అంతగా నప్పవు. ఈ కాలానికి ఏదైనా తేలికగా, చల్లగా, రిఫ్రెషింగ్‌గా ఉండే పానీయం తాగాలనిపిస్తుంది. రెడ్ వైన్‌తోనే అలాంటిది తయారుచేసుకుంటే? అవును, మీరు విన్నది నిజమే. స్పెయిన్ దేశస్థులు వేసవిలో ఎక్కువగా ఇష్టపడే "టింటో డి వెరానో" అలాంటిదే. రెడ్ వైన్, లెమన్ సోడాతో తయారుచేసే ఈ డ్రింక్, వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.
టింటో డి వెరానో చరిత్ర ఇదే!
స్పానిష్ భాషలో ‘టింటో డి వెరానో’ అంటే ‘వేసవి కాలపు రెడ్ వైన్’ అని అర్థం. ఈ పానీయం 20వ శతాబ్దం ప్రారంభంలో స్పెయిన్‌లోని కార్డోబాలో పుట్టిందని చెబుతారు. టింటో అమోరియో అనే బ్లాగ్ కథనం ప్రకారం, ఫెడెరికో వర్గాస్ అనే వ్యక్తి తన ‘వెంటా వర్గాస్’ అనే రెస్టారెంట్‌లో దీనిని మొదటిసారిగా తయారుచేశారట. వేసవిలో తన కస్టమర్లకు రెడ్ వైన్‌కు బదులుగా తేలికైన, చల్లని పానీయం అందించాలనే ఆలోచనతో, హౌస్ రెడ్ వైన్‌లో సోడా కలిపి ఇచ్చారు. అది అందరికీ నచ్చడంతో బాగా ప్రాచుర్యం పొందింది.
మొదట్లో దీనిని సృష్టికర్త పేరు మీదుగా ‘వర్గాస్’ అని పిలిచేవారట. క్రమంగా అండలూసియా ప్రాంతం అంతటా, ఆ తర్వాత స్పెయిన్ మొత్తం దీని రుచి పాకింది. అప్పటి నుంచి దీనిని ముద్దుగా ‘టింటో డి వెరానో’ అని పిలవడం ప్రారంభించారు. ప్రస్తుతం స్పెయిన్‌లోని ప్రతి ఇంట్లో, బార్లలో, ముఖ్యంగా వేసవి కాలంలో ఇది తప్పనిసరిగా కనిపిస్తుంది.
తయారీకి కావాల్సినవి చాలా తక్కువే!
టింటో డి వెరానో ప్రత్యేకత దాని తయారీలోని సులభత్వంలోనే ఉంది. సాంప్రదాయకంగా, దీనికి కేవలం రెండే రెండు పదార్థాలు చాలు - ఒక భాగం రెడ్ వైన్, ఒక భాగం నిమ్మకాయ ఫ్లేవర్ ఉన్న సోడా. ఈ రెండింటినీ కలిపి, కొన్ని ఐస్ ముక్కలు వేసి, నిమ్మ లేదా నారింజ ముక్కతో అలంకరించి సర్వ్ చేస్తే, నిమిషంలో స్పానిష్ సమ్మర్ డ్రింక్ సిద్ధం!
కాస్త కొత్తదనం కోరుకునేవారు కొన్ని మార్పులు కూడా చేసుకోవచ్చు. అవేంటంటే:
1. సిట్రస్ ఫ్లేవర్లు: నిమ్మకాయ సోడాకు బదులుగా ఆరెంజ్ సోడా, బిట్టర్ లెమన్ లేదా గ్రేప్‌ఫ్రూట్ సోడా కూడా వాడతారు.
2. వైన్ రకాలు: కొందరు రెడ్ వైన్‌కు బదులు రోజ్ వైన్ ఉపయోగిస్తారు. దీనివల్ల డ్రింక్ మరింత తేలికగా, ఫ్రూటీ ఫ్లేవర్‌తో ఉంటుంది.
3. కాస్త కిక్ కోసం: కొంచెం ఘాటుగా, మరింత రుచిగా ఉండటానికి కొందరు ఇందులో కొద్దిగా రమ్ కూడా కలుపుతారు.
టింటో డి వెరానో, సాంగ్రియా.. రెండూ ఒకటేనా?
రెండూ రెడ్ వైన్ ఆధారిత పానీయాలే అయినా, స్పానిష్ సంస్కృతిలో రెండింటికీ ప్రత్యేక స్థానం ఉన్నా, టింటో డి వెరానో, సాంగ్రియా చాలా భిన్నమైనవి. సాంగ్రియా అంటే ఒక రకంగా ఫ్రూట్ సలాడ్ లాంటిది. ఇందులో రెడ్ వైన్, బ్రాందీ, తరిగిన పండ్లు, ఫ్రూట్ జ్యూస్ లేదా సోడా, తీపి కోసం చక్కెర వంటివి వేస్తారు. అంతేకాకుండా, ఈ పానీయంలోని రుచులన్నీ కలవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.
కానీ, టింటో డి వెరానో చాలా సులభం. రెడ్ వైన్, సోడా కలిపితే చాలు, వెంటనే తాగేయొచ్చు. నిమ్మకాయ ముక్క వేయడం అనేది పూర్తిగా మన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
క్లాసిక్ టింటో డి వెరానో తయారీ విధానం
స్టెప్ 1: ఒక స్పానిష్ రెడ్ వైన్ బాటిల్ తీసుకోండి. ఏదైనా లేతగా ఉండే, యంగ్ రెడ్ వైన్ అయినా పర్వాలేదు.
స్టెప్ 2: ఒక లెమొనేడ్ (నిమ్మకాయ సోడా) బాటిల్ తీసుకోండి. నిమ్మ ఫ్లేవర్ ఉన్న కూల్ డ్రింక్ అయినా సరిపోతుంది.
స్టెప్ 3: ఒక వైన్ గ్లాసులో సమాన భాగాలుగా వైన్, లెమన్ సోడా పోసి నెమ్మదిగా కలపండి.
స్టెప్ 4: ఐస్ ముక్కలు, ఒక నిమ్మకాయ బద్ద వేసి సర్వ్ చేయండి.