ఢిల్లీలో భారీ వర్షాలకు కూలిన పోలీస్ స్టేషన్.. ఎస్సై దుర్మరణం
––
వర్షం కారణంగా స్టేషన్ లోనే ఉండిపోయిన మిశ్రా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు మీదపడడంతో తీవ్ర గాయాలపాలై మిశ్రా మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఢిల్లీలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 వరకు 81.2 మిల్లీ మీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో మోతీ బాగ్, మింటో రోడ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్, ఢిల్లీ కంటోన్మెంట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.