హిమాచల్‌లో పోలిష్ యువతికి చేదు అనుభవం.. ఫోటోకు నిరాకరించడంతో వేధింపులు.. వీడియో ఇదిగో!
- ఘటనను వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన యువతి
- విదేశీ మహిళల భద్రతపై మరోసారి చర్చ
- వేధింపులపై అవగాహన కల్పించడమే తన ఉద్దేశమన్న వ్లాగర్
- తాను జూలో జంతువును కాదని ఆవేదన వ్యక్తం
పోలాండ్ దేశానికి చెందిన కాసియా అనే యువతి భారత్‌లో తన సోలో ట్రిప్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్న సమయంలో తనకు ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఫోటో దిగేందుకు తాను నిరాకరించినందుకు ఓ వ్యక్తి తనను వెంబడించాడని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. కాసియా తన ప్రయాణ అనుభవాలను ఆన్‌లైన్‌లో పంచుకునే ఓ కంటెంట్ క్రియేటర్. హిమాచల్ ప్రదేశ్‌లో తాను బస చేస్తున్న గెస్ట్ హౌస్ నుంచి పర్వత ప్రాంతంలో నడుచుకుంటూ కిందకు వస్తుండగా, ఓ వ్యక్తి ఆమెను సమీపించి ఫోటో అడిగాడు. మొదట తనను ఆ వ్యక్తి ఫోటో తీయమని అడుగుతున్నాడేమో అని కాసియా భావించారు. కానీ, అతను తనతో కలిసి ఫోటో దిగాలని కోరుతున్నాడని కాసేపటికే ఆమె గ్రహించారు.
తాను మాట్లాడేందుకు లేదా ఫోటోలు దిగేందుకు సిద్ధంగా లేనని మర్యాదపూర్వకంగానే తిరస్కరించినట్టు కాసియా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ‘భారత్‌లో చాలా కాలంగా ఉంటున్నాను. ఎంతోమంది అపరిచితులతో సెల్ఫీలు దిగాను. వారితో చిన్నగా మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటివి చేయాలని నాకు ఏమాత్రం అనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.
అయితే, కాసియా నిరాకరించడాన్ని ఆ వ్యక్తి అంగీకరించలేదని తెలుస్తోంది. అతను తనను అనుసరించడం కొనసాగించాడని, హిందీలో ఏదో అరిచాడని ఆమె తెలిపారు. దీంతో కొంత ఆందోళనకు గురైన కాసియా ఆ ఘటనను తన ఫోన్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించారు. ‘నేను నీతో ఫోటో దిగాలని అనుకోవడం లేదు. దయచేసి నన్ను వెంబడించడం ఆపుతావా? నాకు ఇది నచ్చడం లేదు’ అని ఆమె వీడియోలో అనడం స్పష్టంగా వినిపిస్తోంది. కెమెరాను గమనించగానే ఆ వ్యక్తి కళ్లు తిప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వీడియోలో కనపడింది.
కాసియా ఆవేదన
ఈ ఘటన తర్వాత తాను తీవ్ర అసౌకర్యానికి లోనయ్యానని కాసియా తన పోస్ట్‌లో తెలిపారు. ‘నేను జూలో జంతువును కాదు. అందరూ వచ్చి చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కొందరు భారతీయ పురుషులకు చెబుతున్నా.. దయచేసి నీచంగా ప్రవర్తించకండి. మేం (విదేశీ మహిళలం) మమ్మల్ని మాంసం ముద్దల్లా చూడాలని కోరుకోం. వింతగా చూడటం వల్ల మేం మీతో మాట్లాడాలనుకోం. నేను ఓ వస్తువును కాదు. నా మానాన నన్ను వదిలేయండి’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వివరణ ఇచ్చిన కాసియా
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కాసియా మరో పోస్ట్‌లో ఈ ఘటనపై మరింత వివరణ ఇచ్చారు. ఈ అనుభవం ఎదురైనప్పటికీ తాను ఒంటరి ప్రయాణాలు ఆపబోనని ఆమె స్పష్టం చేశారు. ‘భారత్ కొత్తగా వచ్చేవారికి అంత సులువు కాదు (ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్) అనే ఓ సామెత ఉంది. మహిళలను భయపెట్టాలని గానీ, దేశం మొత్తానికి చెడ్డపేరు తేవాలని గానీ నా ఉద్దేశం కాదు. ఒక పురుషుడు ఎలా ప్రవర్తించకూడదో ఉదాహరణగా చూపించి ఈ విషయంలో అవగాహన కల్పించాలన్నదే నా లక్ష్యం. మీరు భారతీయులైనా, క్రొయేషియన్లైనా, బ్రిటిష్ వారైనా ఇది వర్తిస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు.
ఈ వీడియోను పోస్ట్ చేయాలా? వద్దా? అని చాలా ఆలోచించానని, కానీ ఈ సమస్య గురించి మాట్లాడటం ముఖ్యమని భావించి పోస్ట్ చేశానని కాసియా తెలిపారు. ‘మనం సమస్యను గుర్తించి దాని గురించి బహిరంగంగా మాట్లాడకపోతే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదు’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటన, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, అందులోనూ విదేశీ పర్యాటకుల భద్రతకు సంబంధించిన ఆందోళనలను మరోసారి ముందుకు తెచ్చింది.

More Telugu News
ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్... చెపాక్ లో సీఎస్కే జట్టుకు చెక్
![]()
తిలక్ వర్మతో అఫైర్ అంటూ వార్తలు... ప్రకటన విడుదల చేసిన శ్రీలీల టీమ్
![]()
గుడ్లు పెట్టగానే తల్లి ఆక్టోపస్‌కు మరణశాసనం.. కారణం ఇదే!
![]()
రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!
![]()
రామ్ చరణ్ తో తన జోడీని చిరంజీవి-శ్రీదేవి కాంబోతో పోల్చిన జాన్వీ కపూర్
![]()
బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు
![]()
40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం
![]()
కాళేశ్వరం అంత్య పుష్కరాలకు 3,360 బస్సులు.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ వెల్లడి
![]()
'అమ్మ' క్యాంటీన్లను ఆధునికీకరించాలని సీఎం విజయ్ ఆదేశాలు
![]()
ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు
![]()
టాలీవుడ్లో మళ్లీ మొదటికొచ్చిన పర్సంటేజీ వివాదం!
![]()
సీఎస్కే బ్యాటర్లకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు.. ఆకట్టుకున్న కమిన్స్
![]()
అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే!
![]()
హెచ్1బీ వీసా అలర్ట్.. ఈ కారణంతో కూడా మీకు నో చెప్పవచ్చు!
![]()
వరంగల్ లో రౌడీషీటర్లతో రోడ్డుపై పరేడ్ చేయించిన పోలీసులు
![]()