ఈ మధ్యాహ్నం జరగాల్సిన హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా... మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతుల సమావేశం
- భారత్-పాక్ మధ్య చల్లారుతున్న ఉద్రిక్తతలు
- ఇటీవల కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం
- ఒప్పందం కొనసాగింపునకు నేడు హాట్ లైన్ లో భారత్-పాక్ చర్చలు
- చర్చలు జరపనున్న ఇరుదేశాల డీజీఎంఓలు
అటు, దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నివాసంలో మరో కీలక భేటీ జరుగుతోంది. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.