భారత్ కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ కీలక సూచన
- పాకిస్థాన్ ఊసరవెల్లి లాంటిది, దానిని నమ్మొద్దని విజ్ఞప్తి
- శాంతి, సోదరభావం అంటూ పాక్ చెప్పే మాటలన్నీ మోసపూరితమని మండిపాటు
- బలూచిస్థాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బీఎల్ఏ
తనపై వస్తున్న ఆరోపణలపైనా బీఎల్ఏ స్పందించింది. విదేశీ మద్దతున్న పార్టీ అంటూ వస్తోన్న విమర్శలను తోసిపుచ్చింది. ‘‘ప్రస్తుతం బలూచిస్థాన్ ప్రాంతానికి సంబంధించి సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది. మేమేమీ కీలుబొమ్మలం కాదు, ఏం జరిగినా మౌనంగా చూస్తూ ఉండిపోము. బలూచిస్థాన్ లో మా పాత్ర ఏమిటనే దానిపై మాకు పూర్తి స్పష్టత ఉంది’’ అని వెల్లడించింది. పాకిస్థాన్ భూభాగంలోని బలూచిస్థాన్ లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎడారి వాతావరణం కారణంగా అది అత్యంత వెనుకబడి ఉంది. పాక్ ఖజానాకు గణనీయమైన ఆదాయం ఇక్కడి నుంచే వస్తున్నప్పటికీ బలూచిస్థాన్ అభివృద్ధి విషయంలో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వేర్పాటువాదం పురుడు పోసుకుంది. ప్రత్యేక బలూచిస్థాన్ కోసం స్థానికులు దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నారు.