కొనసాగుతున్న ఉద్రిక్తత.. అమృత్‌సర్‌లో రెడ్ అలెర్ట్

Amritsar on Red Alert Amidst India Pakistan Tension
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, అయినప్పటికీ రెడ్ అలెర్ట్ కొనసాగుతోందని, రెడ్ అలెర్ట్‌కు సూచనగా సైరన్లు మోగుతాయని, ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని, కిటికీల వద్దకు కూడా వెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అందరూ ఈ నిబంధనలు పాటించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. 

అంతకుముందు, తెల్లవారుజామున 4:39 గంటలకు కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇళ్లలో లైట్లు ఆర్పివేయాలని, కిటికీలు, రోడ్లు, బాల్కనీలు లేదా టెర్రస్‌ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. సాధారణ కార్యకలాపాలు ఎప్పుడు పునఃప్రారంభించవచ్చో తెలియజేస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 
Go Back to Shorts
Amritsar Red Alert
India-Pakistan Tension
Punjab
Amritsar District Collector
Red Alert Instructions
India Pakistan Conflict
Border Tension
Amritsar Security
Pakistan Border
Safety Guidelines

More Telugu News