పాకిస్థాన్ లో భూకంపం
- అర్ధరాత్రి దాటిన తర్వాత కంపించిన భూమి
- రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైన తీవ్రత
- వరుస భూకంపాలతో భయాందోళనలో జనం
- ఇటీవలి కాలంలో ఇది నాలుగోసారి
ఇటీవలి కాలంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయి. సోమవారం కూడా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 4.2 తీవ్రతతో భూమి కంపించింది. ఏప్రిల్ 30న 4.4 తీవ్రతతో, ఏప్రిల్ 12న 5.8 తీవ్రతతో కూడా భూకంపాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఏప్రిల్ 12న వచ్చిన భూకంపం కూడా 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించడంతో, ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
భారత, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సంగమ స్థానంలో ఉండటం వల్ల పాకిస్థాన్ ప్రపంచంలోనే భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, గిల్గిత్-బల్టిస్థాన్, పంజాబ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ వంటి ప్రావిన్సులు క్రియాశీల ఫాల్ట్ లైన్లకు సమీపంలో ఉండటంతో భూకంప ముప్పు ఇక్కడ ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.