ఆపరేషన్ సిందూర్.. సరిహద్దులు దాటకుండానే శత్రువుపై దాడి
- భారత సరిహద్దుల్లో నుంచే క్షిపణుల ప్రయోగం
- సైనిక క్యాంపుల జోలికి వెళ్లని భారత ఆర్మీ
- గురి తప్పకుండా ఉగ్రవాద క్యాంపులపై బాంబుల వర్షం
భారత సైన్యం ఈ ఆపరేషన్‌ను భారత గగనతలం నుంచే నిర్వహించిందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సరిహద్దు నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. ఇందుకోసం రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు స్కాల్ఫ్ క్రూయిజ్ మిసైల్స్, ఖచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులు, మరియు హరోప్ కామికేజ్ డ్రోన్‌ల వంటి అధునాతన ఆయుధాలను ఉపయోగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటితో ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేసినట్లు వివరించాయి. ఇది భారతదేశం యొక్క ఉద్దేశపూర్వక, నియంత్రిత సైనిక వ్యూహాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.