బార్డర్ లో ఉద్రిక్తతల వేళ భారత ఆర్మీ సమాచారం పాక్ కు లీక్..!
- పంజాబ్ లోని అమృత్ సర్ లో ఇద్దరు యువకుల అరెస్ట్
- పాక్ నిఘా అధికారులకు సమాచారం అందించినట్లు ఒప్పుకున్న నిందితులు
- ఇద్దరిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు
దీంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు అమృత్ సర్ లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పాక్ నిఘా అధికారులకు సమాచారం చేరవేసినట్లు అంగీకరించారని సమాచారం. అమృత్‌సర్‌లోని కంటోన్మెంట్ ఏరియాతోపాటు ఎయిర్ బేస్‌కు సంబంధించిన పలు చిత్రాలను సైతం వీరు పాకిస్థానీ అధికారులకు అందజేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. దీంతో నిందితులు పాలక్ షేర్ మాసిహ్, సురజ్ మాహిష్ అని వెల్లడించారు. అమృత్ సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టూ, హ్యాపీ సూచనల మేరకు తాము ఈ పనిచేసినట్లు చెప్పారన్నారు. అధికారిక రహస్యాల చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.