తాజా పరిణామాలపై పాక్ మాజీ మంత్రి ట్వీట్
- పవాల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని పాక్‌లో భయాందోళన
- పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు
- తమ మాతృభూమిని రక్షించుకోవడానికి రాజకీయ విభేదాలు పక్కన పెట్టి పాకిస్థాన్ జెండా కింద కలిసి ఉంటామని వెల్లడి
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే సరిహద్దుల్లో బలగాలను మోహరించింది. భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయం పాక్‌లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతదేశం దాడి చేసినా లేదా బెదిరించినా దేశాన్ని రక్షించుకోవడానికి తామంతా కలిసి నిలబడతామని ఆయన అన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ దేశం కోసం ఒక్కటిగా ఉంటామని పేర్కొన్నారు. మాతృభూమిని కాపాడుకోవడానికి పాకిస్థాన్ జెండా కింద ఐక్యంగా నిలుస్తామని తెలిపారు.
అలాగే, మోదీ ప్రభుత్వం నుంచి సంయమనం ఆశిస్తున్నట్లు చౌదరి ఫవాద్ మరో పోస్ట్ పెట్టారు. భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించిందని, యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టవద్దని ఆశిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.