డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నటుడు కృష్ణభగవాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు తనతో కూడా చాలా బాగా మాట్లాడినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. తన గురించి గుర్తుపెట్టుకుని మరీ మీరు మంచి రైటర్ కదా... అని మాట్లాడినట్టు కృష్ణభగవాన్ తెలిపారు. హీరో, డిప్యూటీ సీఎం అనే భావన లేకుండా ఒక మంచి మనిషిలా ఆయన ప్రవర్తన ఉంటుందని చెప్పుకొచ్చారు. కృష్ణభగవాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై పవన్ అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.