Gujarat Titans: ఐపీఎల్: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... ఢిల్లీ దూకుడు

- ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
- అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఇవాళ శనివారం కావడంతో ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దూకుడుగా ఆడుతోంది. ఆ జట్టు 8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 89 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 18 పరుగులు... కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 28 పరుగులు చేసి అవుటయ్యారు.
ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కరుణ్ నాయర్ 27 (బ్యాటింగ్), కెప్టెన్ అక్షర్ పటేల్ 12 (బ్యాటింగ్) పరుగులతో ఆడుతున్నారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీశారు.