లైట్ కలర్ శారీలో పూజా హెగ్డే సోయగాలు... ఫొటోలు ఇవిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లైట్ కలర్ శారీలో పూజా హెగ్డే సోయగాలు... ఫొటోలు ఇవిగో!

Pooja Hegdes Stunning Look in a Light Colored Saree
 
స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే ఏ డ్రెస్ ధరించినా అందానికి లోటు ఉండదు. తాజాగా ఆమె చీరకట్టులో మెరిసిపోయింది. లైట్ మింట్-గ్రే మిక్స్డ్ కలర్ ప్యూర్ కాటన్ శారీ ధరించిన పూజా హెగ్డే... ఆర్ట్ వర్క్ చేసిన మ్యాచింగ్ బ్లౌజ్... ఇయర్ రింగ్స్... మెడలో హారాలు... చేతికి సింపుల్ గా ఎర్రటి మట్టిగాజులు... వేలికి ఉంగరం... నుదుటన చిన్న బొట్టుతో... ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చింది. 

ఈ ఫొటో షూట్లో అమ్మడు పలు భంగిమల్లో కుర్రాళ్ల మదిలో గిలిగింతలు పెట్టేలా కనిపించింది. కొన్ని ఫొటోల్లో చిరునవ్వుతో, మరికొన్ని ఫొటోల్లో ఏదో ఆలోచనలో ఉన్నట్టు, అష్ట విధ నాయికలను తలపించేలా మరికొన్ని ఫొటోల్లో...  మొత్తమ్మీద పూజా హెగ్డే అంటే ఇదీ అనిపించేలా సోయగాలు ఒలకబోసింది. 

ఇదంతా తమిళ స్టార్ హీరో సూర్యతో జతగా నటించిన 'రెట్రో' సినిమా కోసం. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ఇటీవల పూజా హెగ్డే తెలుగులో సినిమాలు తగ్గించి, తమిళంలో జోరు పెంచింది. ప్రస్తుతం ఆమె చేతిలో కాంచన-4, జననాయగన్ చిత్రాలున్నాయి. రజనీకాంత్ కూలీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లోనూ పూజా నటించనున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Pooja Hegde
Pooja Hegde saree
Pooja Hegde photos
Retro movie
Suriya
Karthik Subbaraj
Kanchana 4
Janaganamana
South Indian actress
Tamil movies

More Telugu News