పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ.. వీడియో ఇదిగో!
2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది. సముద్రంలో 2.08 కి.మీ. పొడవున్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకలు సాగించేలా, కింది నుంచి ఓడలు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. 2019 మార్చి 1న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... ఆదివారం ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. మోదీ పచ్చజెండా ఊపగానే ఈ బ్రిడ్జి పైనుంచి రామేశ్వరం-తాంబరం స్పెషల్ ట్రైన్ పరుగులు తీసింది.