రామాపురం తీరంలో అలల తాకిడికి కొట్టుకుపోయిన యువకులు.. వీడియో ఇదిగో!
--
సమీపంలో ఉన్న మెరైన్ పోలీసులు వెంటనే స్పందించారు. సముద్రంలోకి వెళ్లి యువకులను ఒడ్డుకు తీసుకొచ్చారు. వంశీ(27) పరిస్థితి విషమించడంతో చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచాడు. ఇదేప్రాంతంలో జరిగిన మరో సంఘటనలో పల్నాడు జిల్లా పసుమర్తికి చెందిన షేక్ రహంతుల్లా అలల ధాటికి కొట్టుకుపోగా, మెరైన్ పోలీసులు రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.