రంగారెడ్డి జిల్లాలో కారులో మంటలు
Advertisement

రంగారెడ్డి జిల్లాలో కారులో మంటలు

Fire broke out in a car
  • చేవెళ్ల మండలం కందవాడ స్టేజ్ సమీపంలో ప్రమాదం
  • కేసారం గ్రామవాసి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం
  • ప్రమాదాన్ని గుర్తించి కారులో నుంచి దిగిపోయిన రాజశేఖర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజ్ సమీపంలో ఓ కారులో నుంచి మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి ప్రమాదాన్ని గుర్తించి కారులో నుంచి కిందకు దిగిపోయాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు కారు యజమాని తెలిపారు. విషయం తెలియగానే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.
Advertisement
Fire Accident
Car
Hyderabad

More Telugu News