అందరికంటే నేనే సీనియర్ ఎమ్మెల్యే: దానం నాగేందర్
- తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే శంకుస్థాపన చేశారన్న దానం
- దాన్ని తాను పగలగొట్టానని వెల్లడి
- మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వడం లేదని మండిపాటు
మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వడం లేదని దానం మండిపడ్డారు. తాను అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేనని, తనకు ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
కొత్త భవనాల విషయంలో సోషల్ మీడియాలో చిన్నచిన్న పత్రికలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని... వాటికి జీహెచ్ఎంసీ అధికారులు భయపడిపోతున్నారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించని అధికారులు... సోషల్ మీడియా వాళ్లు ఫోన్ చేస్తే మాత్రం భయపడుతున్నారని అన్నారు. అధికారులు, వాళ్లు కలిసి లావాదేవీలు చేసుకుంటున్నారని... వీటిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పారు.