BRS MLC: కోడిపందేల కేసు... బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు

Police notices to BRS MLC Srinivas Reddy in cockfight case
షార్ట్స్‌లో చూడండి
ఫామ్ హౌస్ లో కోడి పందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు మాదాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అతికించారు. శుక్రవారం తమ ముందుకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

కేసు వివరాల్లోకి వెళితే... గత నెలలో తొల్కట్టలోని ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున కోడిపందేలు, కేసినో నిర్వహించారు. ఆ సమయంలో ఫామ్ హౌస్ పై దాడి చేసిన పోలీసులు మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఫామ్ హౌస్ ను లీజుకు ఇచ్చానని పోలీసులకు ఆయన తెలిపారు. ఈ కేసులో ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి.
Go Back to Shorts
BRS MLC
Pochampalli Srinivas Reddy

More Telugu News