పాకిస్థాన్ లో రైలును హైజాక్ చేశారు!

BLA hijacked a train in Pakistan
  • బలూచిస్థాన్ కోసం పోరాడుతున్న బీఎల్ఏ
  • జఫ్ఫార్ ఎక్స్ ప్రెస్ రైలుపై దాడి
  • 400 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న వైనం
పాకిస్థాన్ లో ఓ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేశారు. బలూచిస్తాన్ ను స్వతంత్ర ప్రాంతంగా గుర్తించాలన్న డిమాండ్ తో పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఈ దుశ్చర్యకు పాల్పడింది. వందలాంది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకుంది. ఈ క్రమంలో ఆరుగురు సైనికులను హతమార్చింది. 

400 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జఫ్పార్ ఎక్స్ ప్రెస్ రైలుపై బీఎల్ఎ మిలిటెంట్లు దాడి చేశారు. రైలులోని మొత్తం 9 బోగీలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు రైలును హైజాక్ చేసినట్టు బీఎల్ఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనకు తమదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. పాక్ భద్రతా బలగాలు ఏవైనా చర్యలకు దిగితే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది. 

పాకిస్థాన్ లో బలూచిస్తాన్ విస్తీర్ణం పరంగా అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. దేశంలోని 44 శాతం భూభాగం ఈ రాష్ట్ర పరిధిలోకే వస్తుంది. అయితే, దేశంలోనే అత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఇదే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డీప్ సీ పోర్టుల్లో ఒకటైన గ్వాదర్ పోర్టు బలూచిస్తాన్ లోనే ఉంది.
Go Back to Shorts
Train Hijack
BLA
Pakistan

More Telugu News