ఒక్క రోజులోనే రూ. 1.91 లక్షల కోట్లు కోల్పోయిన ఎలాన్ మస్క్
- వరుసగా నాలుగో రోజు కూడా టెస్లా షేర్లు పతనం కావడమే కారణం
- యూరప్‌లో 45 శాతం మేర క్షీణించిన టెస్లా కార్ల విక్రయాలు
- ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో నిన్న ఒక్కరోజు టెస్లా షేర్లలో 8.4 శాతం క్షీణత
- 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయిన కంపెనీ విలువ
యూరప్‌లో టెస్లా కార్ల అమ్మకాలు 45 శాతం మేర క్షీణించాయి. యూరప్‌లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగినప్పటికీ, టెస్లా కార్ల అమ్మకాలు తగ్గడం అనేది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ లో టెస్లా షేర్లు నిన్న ఒక్కరోజే 8.4 శాతం క్షీణించడంతో కంపెనీ విలువ 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. గతేడాది నవంబర్ 7 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.
ఇక మస్క్ సంపద సగానికి పైగా టెస్లాలోనే ఉన్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా టెస్లా షేర్లు క్షీణించడంతో ఆయన సంపద ఏకంగా 22.2 బిలియన్ డాలర్లు (రూ. 1.91 లక్షల కోట్లు) ఆవిరైంది.