Harsha Kumar: జగన్ ను చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోంది... అందుకే హోదా ఇవ్వడంలేదు: హర్ష కుమార్

AP Govt is afraid of Jagan says Harsha Kumar
షార్ట్స్‌లో చూడండి
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ నేతలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లు మాత్రమే తెచ్చుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని కూటమి నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? లేదా? అనేది ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. 

గతంలో ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చారని తెలిపారు. జగన్ ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గ్రూప్-2 పరీక్ష అభ్యర్థులను సీఎం చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ ఆడియో విడుదల చేసి గ్రూప్-2 పరీక్ష విషయంలో డ్రామా ఆడారని దుయ్యబట్టారు. ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గ్రూప్-2 అభ్యర్థులు గుణపాఠం చెపుతారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ చేత అన్నీ అబద్ధాలే చెప్పించారని వ్యాఖ్యానించారు.

Go Back to Shorts
Harsha Kumar
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News