భార్యపై ప్రేమతో.. మధ్యప్రదేశ్ లో మరో తాజ్ మహల్
- అర్ధాంగి పట్ల ప్రేమతో తాజ్ మహల్ నిర్మించిన వ్యాపారి
- మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఈ అద్భుత నిర్మాణం
- అసలు తాజ్ మహల్ పరిమాణంలో మూడో వంతు ఈ ఇల్లు
- రెండు అంతస్తులు, విశాలమైన ఇంటీరియర్‌తో నిర్మాణం
- ఇన్‌స్టాగ్రామ్ వీడియోతో వెలుగులోకి వచ్చిన ఈ ప్రేమ సౌధం
భార్యపై ప్రేమకు గుర్తుగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడన్న విషయం అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన భార్య కోసం అచ్చం తాజ్ మహల్ లాగే ఓ అందమైన ఇంటిని నిర్మించి తన ప్రేమను చాటుకున్నారు. ఇప్పుడు ఈ ప్రేమ సౌధం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ప్రకాశ్ చౌక్సే, తన భార్యకు కానుకగా ఈ ఇంటిని నిర్మించారు. 2021లో నిర్మాణం పూర్తయిన ఈ ఇల్లు, ఆగ్రాలోని అసలు తాజ్ మహల్‌కు సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలు కట్టడంలో మూడో వంతు పరిమాణంలో, రెండు అంతస్తుల భవనంగా దీనిని తీర్చిదిద్దారు. ఈ నిర్మాణం పూర్తి చేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పైగా పట్టింది.
బయటి నుంచి చూస్తే తెల్లని గోడలు, ప్రధాన గుమ్మటం, నాలుగు మినార్లు, అందమైన తోటలతో ఇది అచ్చం తాజ్ మహల్‌ను పోలి ఉంటుంది. ఇంటి లోపల ఇంటీరియర్స్ కూడా అంతే అద్భుతంగా, విశాలంగా ఉంటాయి. సుమారు 24 అడుగుల ఎత్తైన సీలింగ్స్, పాలరాతి ఫ్లోరింగ్, రెండు వైపులా మెట్లు, విలాసవంతమైన ఫర్నిచర్‌తో రాజసం ఉట్టిపడేలా దీనిని రూపొందించారు.
ఇటీవల శుభమ్ ప్రజాపత్ అనే ఓ కంటెంట్ క్రియేటర్ ఈ ఇంటిపై ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. చౌక్సే కుమారుడు ఈ ఇంటి విశేషాలను వివరిస్తున్న వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.