ఏపీ ఇంధన రంగంలో కీలక మార్పులకు శ్రీకారం.. 130 జలాశయాల్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫోకస్
- రాష్ట్రంలోని 130 జలాశయాల్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై అధ్యయనం
- సెప్టెంబర్ నాటికి 6 లక్షల 'పీఎం సూర్య ఘర్' సోలార్ కనెక్షన్ల ఏర్పాటుకు ఆదేశం
- విద్యుత్ కొనుగోలు సగటు ఖర్చును యూనిట్‌కు రూ.4కు తగ్గించాలని లక్ష్యం
- రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు పనితీరు ఆధారిత రేటింగ్ విధానం ప్రవేశపెట్టాలని సూచన
- రానున్న ఆరేళ్లలో విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుందని అంచనా
ఆంధ్రప్రదేశ్‌ను ఇంధన రంగంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 130 జలాశయాల్లో పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలు, సాధ్యసాధ్యాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఇంధన శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనపై చర్చిస్తూ, రాష్ట్రంలోని ఇతర జలాశయాల వద్ద కూడా ఇలాంటి ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యతపై నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా జలాశయాల నుంచి విద్యుదుత్పత్తికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ ఉత్పత్తి కొనసాగేలా ముందుగానే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతం అవుతున్నందున, ప్రతి ఆరేళ్లకు విద్యుత్ వినియోగం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని, తక్కువ ధరకే విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అదే సమయంలో విద్యుత్ పంపిణీ నష్టాలను మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సౌర విద్యుత్ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 'పీఎం సూర్య ఘర్' పథకం కింద సెప్టెంబర్ నాటికి 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పథకం కిందకు రాని మరో మూడు లక్షల కనెక్షన్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. దీంతోపాటు, మరో 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి దరఖాస్తు చేయాలని అధికారులకు సూచించారు. 'పీఎం-కుసుమ్' పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, అదనంగా 2,000 మెగావాట్ల సామర్థ్యం కోసం కేంద్రాన్ని అభ్యర్థించాలని తెలిపారు.
తక్కువ ఖర్చుతో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థను రూపొందించేందుకు సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ వనరులను అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు నొక్కిచెప్పారు. ఈ ఏడాది సగటు విద్యుత్ కొనుగోలు ఖర్చును యూనిట్‌కు రూ. 4.60కి, 2029 నాటికి రూ. 4కి తగ్గించాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. రాష్ట్రంలోని ఆరు విద్యుత్ సంస్థల (యుటిలిటీల) పనితీరును మెరుగుపరిచేందుకు 'పనితీరు ఆధారిత రేటింగ్' విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. ప్రతి సంస్థకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి, అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలతో పోటీపడేలా వాటిని తీర్చిదిద్దాలని అన్నారు.
ఈ సందర్భంగా, విద్యుత్ కొనుగోళ్లలో ఆప్టిమైజేషన్ ద్వారా రూ. 234 కోట్లు ఆదా అయినట్లు, సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల రిబేట్ల రూపంలో మరో రూ. 100 కోట్లు ఆదా అయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.