ప్రఖ్యాత 'న్యూయార్క్ టైమ్స్'లో అమరావతిపై స్పెషల్ స్టోరీ.. షేర్ చేసిన చంద్రబాబు
- అమరావతి నిర్మాణంపై ప్రఖ్యాత 'న్యూయార్క్ టైమ్స్' ప్రత్యేక కథనం
- భారత్‌లోనే అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- అత్యాధునిక టెక్నాలజీతో 'క్వాంటం వ్యాలీ' ఏర్పాటుకు సన్నాహాలు
- 60 శాతం పచ్చదనం, నీటితో పర్యావరణ హితంగా రాజధాని డిజైన్
- ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంతో వేగంగా సాగుతున్న పనులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేశానికే ఒక ఆదర్శంగా నిలవాలని, జీవన ప్రమాణాల్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతిపై తమ ప్రభుత్వ విజన్‌కు అంతర్జాతీయ పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’లో చోటు దక్కడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
"కేవలం ఒక గొప్ప రాజధానిని నిర్మించడమే మా లక్ష్యం కాదు. భారతదేశంలో జీవన ప్రమాణాలకు సరికొత్త కొలమానాన్ని నిర్దేశించడమే మా ఆశయం" అని చంద్రబాబు పేర్కొన్నారు. హరిత నగరం, సమర్థవంతమైన, అందరినీ కలుపుకొనిపోయే నగరంగా, నాణ్యమైన జీవనశైలితో అమరావతిని తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయమని వివరించారు.
ప్రపంచస్థాయి పట్టణ జీవనం అనేది ఒక సుదూర ఆదర్శం కాదని, భారత్ కూడా అలాంటి నగరాలను నిర్మించగలదని అమరావతి నిరూపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "మా లక్ష్యం ఆశయపూరితమైనదే, కానీ అది సాధించగలిగేదే. అమరావతి దేశానికి ఒక ఉదాహరణగా నిలవాలి" అని చంద్రబాబు తన పోస్టులో స్పష్టం చేశారు. ఈ పోస్టుతో పాటు న్యూయార్క్ టైమ్స్‌లో అమరావతిపై వచ్చిన కథనం లింకును కూడా ఆయన పంచుకున్నారు.
అమరావతిపై 'న్యూయార్క్ టైమ్స్' ప్రత్యేక కథనం ఇదే.. ఒక వ్యక్తి సంకల్పంతో రూపుదిద్దుకుంటున్న నగరం!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుపై అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' (NYT) ఆగస్టు 13న "ఒక వ్యక్తి సంకల్పంతో భారత్‌లో అత్యంత నివాసయోగ్య నగరాన్ని నిర్మించే యత్నం" (One Man’s Quest to Build India’s Most Livable City) అనే శీర్షికతో ఒక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. కృష్ణా నది ఒడ్డున ఒకప్పుడు అరటి తోటలు, కూరగాయల పొలాలతో ఉన్న ప్రాంతంలో, ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలోనే అతిపెద్ద పట్టణ ప్రణాళిక రూపుదిద్దుకుంటున్న తీరును ఈ కథనం కళ్లకు కట్టింది.
'ది న్యూయార్క్ టైమ్స్' కథనం ప్రకారం...
సుమారు 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా, ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం సుమారు 30,000 మంది రైతుల నుంచి 35,000 ఎకరాల భూమిని సమీకరించారు.
ప్రస్తుతం ప్రతిరోజూ 25,000 మందికి పైగా కార్మికులు నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటూ ఈ మహాయజ్ఞాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ దీనికి అద్భుతమైన డిజైన్ అందించారు. నగరం మధ్యలో ఎత్తైన గోపురంతో శాసనసభ భవనం, దాని చుట్టూ మంచినీటి సరస్సు, ఐదు మైళ్ల పొడవునా ప్రభుత్వ భవనాలతో కూడిన గ్రిడ్ లేఅవుట్‌తో నగరాన్ని నిర్మిస్తున్నారు.
అమరావతి కేవలం కాంక్రీట్ జంగిల్ కాదని, పర్యావరణ హితమైన జీవనశైలికి పెద్దపీట వేస్తున్నారని NYT తన కథనంలో పేర్కొంది. నగరంలో దాదాపు 60 శాతం ప్రాంతం పచ్చదనం లేదా నీటి వనరులతో నిండి ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. సైక్లింగ్ కోసం సుమారు 2,000 మైళ్ల ప్రత్యేక లేన్లు, నగరమంతా విస్తరించిన కాలువలు, జలమార్గాలు దీని ప్రత్యేకత.
వికేంద్రీకరణ ఉత్తమమని కొందరు నిపుణులు సూచించినప్పటికీ, ఒకే కేంద్రీకృత రాజధాని ద్వారా ఆధునిక, సమర్థవంతమైన పాలన అందించాలన్న బలమైన సంకల్పంతో చంద్రబాబు ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నారని ఈ కథనం విశ్లేషించింది. ఆయన నాయకత్వంలో రాజకీయ మార్పుల అనంతరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఈ నగరం కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, అత్యాధునిక టెక్నాలజీకి కేంద్రంగా మారనుంది. ఇందులో భాగంగా 50 ఎకరాల విస్తీర్ణంలో 'క్వాంటం వ్యాలీ' పేరుతో ఒక టెక్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వందల మిలియన్ల డాలర్ల పెట్టుబడులు దీనికి ఖరారయ్యాయి.
ఇక్కడ భూకంపాలను తట్టుకునేలా నిర్మించిన భవనంలో వచ్చే ఏడాది జనవరి నుంచి 156-క్యూబిట్ సామర్థ్యమున్న ఐబీఎం క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు తొలి దశ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. పోల్స్ లేని నగరం, గ్రీన్ ఎనర్జీ, డీప్-టెక్నాలజీతో 2028 నాటికి పూర్తిస్థాయిలో నగరాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద, చంద్రబాబు వ్యక్తిగత పర్యవేక్షణలో అమరావతి నిర్మాణం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తోందని 'న్యూయార్క్ టైమ్స్' అభివర్ణించింది.