జనరేషన్ గట్టర్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ మరోసారి వివరణ

Kangana Ranaut clarifies Generation Gutter comments once again
  • తన మాటలను పూర్తిగా వక్రీకరించారని స్పష్టీకరణ
  • దేశంలోని యువత మొత్తాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని వెల్లడి
  • కొందరు నిరసనకారుల ప్రవర్తనపైనే తాను స్పందించానన్న కంగన
తన 'జనరేషన్ గట్టర్' వ్యాఖ్యలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివరణ ఇచ్చారు. దేశంలోని యువత మొత్తాన్ని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను కొందరు వక్రీకరించారని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు.

దేశ యువతను తాను 'గట్టర్ ఛాప్‌లు' అని సంబోధించినట్లు ఒక కాంగ్రెస్ నేత చేసిన విమర్శలపై ఆమె ఘాటుగా స్పందించారు. గత జూలైలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో సుమారు 10,000 మంది పాల్గొంటే, అందులో 2,000 మంది మాత్రమే జెన్-జీ యువత ఉన్నారని, మిగిలిన వారు వేర్వేరు వయసుల వారని ఆమె తెలిపారు. ఆ నిరసనకారుల్లో షబానా అజ్మీ తరహా పెద్దలు కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

"దేశంలో జెన్-జీ జనాభా సుమారు 30 నుంచి 35 కోట్లు ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిమంది పాల్గొన్న నిరసనను జెన్-జీ నిరసనగా ఎలా అభివర్ణిస్తారు?" అని కంగన రనౌత్ ప్రశ్నించారు. యువత మొత్తాన్ని తాను కించపరిచినట్లు ఒక్క ఆధారం చూపించినా దేనికైనా సిద్ధమని ఆమె సవాల్ విసిరారు. "నేను యువతకు వ్యతిరేకం కాదు, ఎందుకంటే నేను కూడా యువతనే. రాహుల్ గాంధీలా నాకు 55-60 ఏళ్ల వయస్సు లేదు" అంటూ ఆమె చురకలంటించారు.
Advertisement
Kangana Ranaut
Generation Gutter comment
BJP MP
Rahul Gandhi
Gen Z youth
Kangana Ranaut Instagram

More Telugu News