మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం

Pope Francis not out of danger
  • ఈ నెల 14 రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్
  • శుక్రవారం కంటే శనివారం మరింత కష్టంగా గడించిందన్న వాటికన్ 
  • శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పోప్
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యం మరింత విషమించింది. ఈ నెల 14 నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతోంది. శ్వాస తీసుకోవడంలో నిన్న మరింతగా ఇబ్బంది పడ్డారు. దీంతో అధిక పీడనంతో (హై ఫ్లో) ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు రక్తాన్ని కూడా మార్చారు. శుక్రవారం కంటే శనివారం మరింత కష్టంగా గడిచిందని, ఈ సమయంలో ఏమీ చెప్పలేమని వాటికన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 

పోప్ న్యూమోనియాతోపాటు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మరో వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రమాదం నుంచి పోప్ బయటపడలేదని ఆయన వ్యక్తిగత ఫిజీషియన్ లూగీ కార్బొన్ తెలిపారు. 

అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936లో జన్మించిన పోప్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. కాగా, దక్షిణార్థ గోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు.
Advertisement
Pope Francis
Vatican City
Holy Father
Rome

More Telugu News