మొన్న నియంత, నేడు కమెడియన్.. జెలెన్ స్కీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- అమెరికాతో 35 వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టించాడంటూ మండిపాటు
- జెలెన్ స్కీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన ట్రంప్
- ట్రంప్ దూతతో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ భేటీ తర్వాత విలేకరుల సమావేశం రద్దు
అయితే, ట్రంప్ మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ మాటలను విశ్వసిస్తూ తమ ఆవేదనను అర్థం చేసుకోవడంలేదన్నారు. బైడెన్ హయాంలో అమెరికా తమకు అందించిన సాయాన్ని ట్రంప్ బాధ్యతలు చేపట్టాక నిలిపేశాడని చెప్పారు. అమెరికా సాయం లేకుంటే ఉక్రెయినియన్లు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేరని చెప్పారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలన్న లక్ష్యంతో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ దూత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లాగ్ గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత మీడియా సమావేశంలో నేతలు ఇద్దరూ మాట్లాడాల్సి ఉండగా.. దానిని రద్దు చేశారు. అమెరికా విజ్ఞప్తి చేయడంతో రద్దు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.