అమెరికాలో కోడిగుడ్ల కొరత.. మూడింతలు పెరిగిన ధర

US Egg Prices Reach 45 Year High as Bird Flu Intensifies
అమెరికాలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉండటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ధరలు 15 శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో మరో 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోడిగుడ్ల కొరత కారణంగా చాలా స్టోర్లలో 'లిమిటెడ్ స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని స్టోర్లలో అయితే, 'నో స్టాక్' బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. కొనుగోలుదారులకు ఒక్కొక్కరికి రెండు లేదా మూడు కోడిగుడ్ల ట్రేలను మాత్రమే విక్రయిస్తున్నారు.

అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా గత ఏడాది డిసెంబర్ నెలలో సుమారు 2.3 కోట్ల కోళ్లను వధించారు. గత ఏడాది జనవరిలో ఒక కోడిగుడ్డు ధర 2.52 డాలర్లు ఉండగా, డిసెంబర్ నాటికి అది 4.15 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ ధర 7.34 డాలర్లకు చేరుకుందని అమెరికా లేబర్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కోడిగుడ్ల ధర 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని సమాచారం.

గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే స్టోర్లలో 'నో స్టాక్' లేదా 'లిమిటెడ్ స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయి. కోడిగుడ్ల కొరత, ధరల పెరుగుదల హోటల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా రెస్టారెంట్లు గుడ్డుతో చేసే వంటకాలపై 50 శాతం అదనపు ఛార్జీని విధిస్తున్నాయి.
Go Back to Shorts
Eggs
USA

More Telugu News