కేసీఆర్ ఓ సీజనల్ ప్రతిపక్ష నేత.. జగ్గారెడ్డి ఎద్దేవా
- మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు
- ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అంటూ విమర్శలు
- మేము ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతాడన్న కాంగ్రెస్ నేత
పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్.. సచివాలయంలో కనీసం మూడు రివ్యూలైనా చేయలేదన్నారు. ఆయన ఐదు లక్షల మందితో సభ పెడితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము ఐదు లక్షల ఒక వెయ్యి మందితో సభ పెడతామన్నారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తుంటారని గుర్తుచేస్తూ.. రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, సభకు వచ్చి మాట్లాడాలని ప్రతిపక్ష నేతను పిలుస్తోందని చెప్పారు. స్పీకర్ కూడా కేసీఆర్ ను పిలిచారని గుర్తుచేశారు. సీఎంగా ఉంటేనే సభకు వస్తారా.. ప్రతిపక్ష నేతగా ఉంటే అసెంబ్లీకి రారా అని జగ్గారెడ్డి నిలదీశారు.