వైజాగ్‌లో నా పరువు పోతుంది... ప్లీజ్: నాగచైతన్య
- వైజాగ్‌లో 'తండేల్' ట్రైలర్ విడుదల
- అల్లు అరవింద్ తన జీవితంలో 'తండేల్' అంటోన్న నాగచైతన్య
- ఈ సినిమా టాక్‌ను వైజాగ్ నుంచే తెలుసుకుంటానని వెల్లడి
ఆయన లేకుండా నేను మరో సినిమా చేయగలనా అనే భావన కలిగింది. ఈ సినిమాకు ఆయన సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక వైజాగ్‌తో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది. నా సినిమా విడుదలైన వెంటనే మొదటగా వైజాగ్ టాక్ తెలుసుకుంటాను. వైజాగ్‌లో సినిమా ఆడితే ప్రపంచం మొత్తం ఆడినట్లే.
వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ వాళ్లదే. కాబట్టి మీకో విన్నపం. 'తండేల్' సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేదంటే మా ఇంట్లో నా పరువు పోతుంది" అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, "హీరో నాగచైతన్య కెరీర్‌లో ఉత్తమ నటనను ఈ సినిమాలో చూస్తారు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మన గుండె కరిగిపోయేలా నటించాడు. ఈ సినిమాతో చైతన్య మంచి నటుడు అనిపించుకుంటాడు" అని తెలిపారు. అయితే ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు పాల్గొనలేదు.