జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట
- రఘురామ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం
- బెయిల్ రద్దు పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదన్న కోర్టు
- తన పిటిషన్ ను వాపస్ తీసుకున్న రఘురామ
ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు కోసం ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని తెలిపింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకూ వర్తిస్తుందని పేర్కొంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని, హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సూచించింది. అదే సమయంలో ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో తమ పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని రఘురామ తరఫు లాయర్ కోరగా.. ధర్మాసనం అందుకు అంగీకరించింది.