క్రెడిట్ మొత్తం ప్రధాని మోదీకి దక్కుతుంది: నారా లోకేశ్
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- మోదీ, నిర్మల, కుమారస్వామిలకు ధన్యవాదాలు తెలిపిన లోకేశ్
- ఎన్నికల హామీని చంద్రబాబు నిలుపుకున్నారని వ్యాఖ్య
ఈ ప్లాంట్ వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు. ఉక్కు రెక్కల ఆయుధాలతో ఏపీ సరికొత్త శిఖరాలకు ఎదుగుతుందని, లక్షల మంది జీవితాలను మార్చుతుందని అన్నారు.