2025కి వినూత్న రీతిలో స్వాగతం పలికిన రైల్వే ఉద్యోగులు.. వీడియో ఇదిగో
- ఓ రైల్వే స్టేషన్‌లో ఆకట్టుకున్న న్యూఇయర్ సెలబ్రేషన్స్
- సరిగ్గా అర్ధరాత్రి 00:00 గంటల సమయంలో హారన్లు మోగించిన పైలట్లు
- హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన ప్యాసింజర్లు, రైల్వే ఉద్యోగులు
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు, రైలు పైలట్లు చాలా ఉత్సాహంగా 2025కి స్వాగతం పలికారు. అర్ధరాత్రి సరిగ్గా 00:00 గంటలకు పైలట్లు రైలు హారన్లను కొద్దిసేపు ఏకధాటికి మోగించారు. దీంతో ప్లాట్‌ఫామ్‌పై ప్యాసింజర్లు కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. రైల్వే ఉద్యోగుల న్యూఇయర్ వేడుక గూస్‌బంప్స్ తెప్పించిందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. 2025కి అద్భుతంగా స్వాగతం పలికారని కొందరు అభివర్ణించారు. ఇదొక స్ఫూర్తిదాయకమైన వేడుక అని, అక్కడ ఉన్న అందరినీ ఐక్యం చేసిందని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. కాగా, ఈ సెలబ్రేషన్స్ ఏ రైల్వే స్టేషన్‌లో జరిగాయనేది తెలియరాలేదు.