వారు పడుతున్న ఇబ్బందిని రేవంత్ రెడ్డి, నేను గమనిస్తున్నాం: భట్టి విక్రమార్క
- సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల బిల్లులను విడుదల చేయాలనుకుంటున్నామని వెల్లడి
- పెండింగ్ నిధులపై బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్య
- రూ.10 లక్షల లోపు ఉన్న వాటిని తొలుత విడుదల చేయాలనుకుంటున్నట్లు వెల్లడి
అయితే ఈ నిధుల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు దాదాపు రూ.1,300 కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఇందులో రూ.10 లక్షల లోపు బకాయిల విలువ దాదాపు రూ.400 కోట్లుగా ఉందన్నారు. తొలుత ఈ బిల్లులను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం వారి బిల్లులను పెండింగ్లో పెట్టిందని ఆరోపించారు.