అడిలైడ్ టెస్ట్.. భారత టాపార్డర్ విఫలం.. స్వల్ప స్కోరుకే 5 వికెట్లు
- 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్
- జైస్వాల్ 0, రోహిత్ 3, విరాట్ 7 పరుగులకే ఔట్
- చెలరేగిన ఆస్ట్రేలియా పేసర్లు
కాగా ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే కేవలం 3 పరుగులు చేసి పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. ఆసీస్ కొత్త పేసర్ బోలాండ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఒక ఫోర్ కొట్టి మంచి టచ్‌లోకి వచ్చినట్టు కనిపించినప్పటికీ.. స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.