మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరో చెప్పేసిన బీజేపీ నేత

Devendra Fadnavis Will Become CM Of Maharashtra
  • బీజేపీ సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ దాటనున్నట్లు ట్రెండ్స్
  • 149 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల లీడ్
  • సీఎం కుర్చీపై వీడిన పీటముడి?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఏకంగా 216 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులే 149 చోట్ల ముందంజలో ఉన్నారు. ఇది మ్యాజిక్ ఫిగర్ (145) కన్నా ఎక్కువ కావడంతో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి పదవిపై సందిగ్ధత తొలగినట్లే కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత ప్రవీణ్ ధరేకర్ ప్రకటన కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఫడ్నవీస్ సీఎం పదవి చేపడతారని కాసేపటి క్రితం ఆయన ప్రకటించారు.

దీనిపై చర్చించేందుకు మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే కాసేపట్లో ఫడ్నవీస్ ను కలవనున్నట్లు సమాచారం. కూటమి గెలిస్తే సీఎం కుర్చీ ఎవరు చేపడతారనే విషయంపై శనివారం ఉదయం వరకు సందిగ్ధత కొనసాగింది. బీజేపీ, శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ వర్గం) పార్టీల నేతలంతా తమ నాయకుడే సీఎం అవుతారంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే, బీజేపీ సింగిల్ గానే మెజారిటీ వైపు దూసుకెళుతుండడంతో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. కాగా, మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుపు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Maharashtra Results
Maha CM
Devendra Fadnavis
BJP
NDA

More Telugu News