రేవంత్ రెడ్డి వారినే తొక్కుకుంటూ సీఎం పదవిలోకి వచ్చారు: హరీశ్ రావు
- చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక పిచ్చి మాటలు మాట్లాడారని విమర్శ
- కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి పాపం పోదని ఆగ్రహం
- షార్ట్ కట్లో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను తొక్కేస్తున్నాడని విమర్శ
హన్మకొండ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, కేసీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక హన్మకొండ సభలో పిచ్చి మాటలు మాట్లాడారన్నారు. ఈ ప్రభుత్వం చేసిన ఘోరాలను ప్రజలు మరిచిపోలేరన్నారు.
కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి పాపం పోదన్నారు. షార్ట్ కట్లో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను కూడా తొక్కేస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు.